
ప్రిన్స్ మహేష్ బాబుతో బాలీవుడ్ భామ సోనాక్షీ సిన్హా జోడీ కట్టబోతుందా ? అంటే అవుననే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు.బాలీవుడ్ లో 'దబాంగ్' ... 'రౌడీ రాథోడ్' వంటి వరుస విజయాలతో టాప్ హీరోయిన్ గా దూసుకుపోతున్న సోనాక్షీపై ఇప్పుడు మన దర్శక నిర్మాతలు కళ్లు పడ్డాయట.వైజయంతీ మూవీస్ బ్యానర్లో మహేష్ హీరోగా క్రిష్ దర్శకత్వంలో త్వరలో తెరకెక్కబోతున్న సినిమాలో సోనాక్షీ సిన్హా కధానాయకగా ఎంపికయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు సమాచారం. |