
చిల్లర వర్తకంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్‌డిఐ)కు లోక్‌సభ ఆమోదం తెలిపింది. ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన తీర్మానం వీగిపోయింది. ఎఫ్డిఐకు సంబంధించి లోక్‌సభలో జరిగిన ఓటింగ్‌లో యుపిఏ ప్రభుత్వం నెగ్గింది. ఓటింగ్‌లో మొత్తం 471 మంది సభ్యులు పాల్గొనగా 72 మంది సభ్యులు గౌర్హాజరయ్యారు. యుపిఏ ప్రభుత్వం నెగ్గటానికి కావలసిన మ్యాజిక్ ఫిగర్ 251. ఎఫ్‌డిఐలకు అనుకూలంగా 253 ఓట్లు రాగా, వ్యతిరేకంగా 218 ఓట్లు వచ్చాయి. ఓటింగ్‌లో నెగ్గడానికి 236 ఓట్లు కావలసి ఉండగా, 253 ఓట్లు వచ్చాయి. ఎస్పి, బిఎస్పి సభ్యులు ఓటింగ్‌కు ముందే సభ నుంచి వాకౌట్ చేయడంతో యుపిఏ ప్రభుత్వం గట్టెక్కింది. |